ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రతి దేశం అంతర్గత సమస్యలపై దృష్టి సారించాలి: వాషింగ్టన్ గవర్నర్ - వాషింగ్టన్ రాష్ట్ర గవర్నర్ రాబర్ట

సియాటిల్​లో ఇటీవల జరిగిన ప్రవాస భారతీయుల కార్యక్రమానికి వాషింగ్టన్ రాష్ట్ర గవర్నర్ జే రాబర్ట్ ఇన్స్లీ హాజరయ్యారు. ఆర్టికల్ 370 చర్చకు వచ్చిన సందర్భంలో ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కంటే, తమ పరిధిలో ఉన్న కమ్యూనిటీకి సేవలందించటంపై దృష్టి సారించాలని ఇన్స్లీ వ్యాఖ్యానించారు. ప్రతి దేశానికి సొంత సమస్యలున్నాయని..అంతర్గత సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు.

nri's meeting
సియాటిల్​లో ప్రవాస భారతీయుల కార్యక్రమం

By

Published : Oct 30, 2020, 10:44 PM IST

సియాటిల్​లో ఇటీవల ప్రవాస భారతీయుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వాషింగ్టన్ రాష్ట్ర గవర్నర్ జే రాబర్ట్ ఇన్స్లీ హాజరయ్యారు. టి.జి.విశ్వ ప్రసాద్, వందన ప్రసాద్ నిర్వహించిన వర్చువల్ ఫండ్ రైజర్​లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు గవర్నర్. వాషింగ్టన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్మాణంతోపాటు రాష్ట్రం సాంస్కృతిక గుర్తింపును సుసంపన్నం చేయడంలో గవర్నర్ ఇన్స్లీ యొక్క పాత్రను ప్రత్యేకంగా అభినందించారు ప్రవాస భారతీయులు. దేశంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో వాషింగ్టన్ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రగతిశీల నాయకుడిగా గవర్నర్ ఇన్ స్లీని ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రస్తుత కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో తమ ప్రభుత్వం ఎంతో సమర్ధవంతంగా పని చేస్తోందని గవర్నర్ ఇన్ స్లీ వివరించారు.

భారత పార్లమెంటు ఇటీవల తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఆర్టికల్ 370 చర్చకు వచ్చిన సందర్భంలో గవర్నర్ ఇన్స్లీ మాట్లాడుతూ...ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కంటే, తమ పరిధిలో ఉన్న కమ్యూనిటీకి సేవలందించడంపై దృష్టి సారించాలని వ్యాఖ్యానించారు. ప్రతి దేశానికి సొంత సమస్యలున్నాయని..,అంతర్గత సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు.

2021లో 75 వసంతాల భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సియాటెల్​లో భారీగా నిర్వహించబోతున్నారు టీ.జి. విశ్వప్రసాద్. 20 వేల మందితో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని గవర్నర్​ను విశ్వప్రసాద్ ఆహ్వానించారు. గవర్నర్ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించారు. 2021 ఆగస్టు నాటికి కరోనా మహమ్మారి పరిస్థితి తగ్గిపోతుందని..,కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించవచ్చని ఆశించారు.

2012లో, విశ్వప్రసాద్ అప్పటి గవర్నర్ క్రిస్టిన్ గ్రెగోయర్ యొక్క వాణిజ్య ప్రతినిధి బృందాన్ని భారతదేశానికి సమన్వయపరిచారు. అలాగే 2021లో భారతదేశానికి ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆయన గవర్నర్ ఇన్ స్లీని కోరారు. గవర్నర్ ఈ విషయంపై చాలా ఆసక్తితో స్పందించి తన సానుకూలత తెలిపారు.

ఇదీచదవండి

సీఎం జగన్ వెళ్లే మార్గంలో డీఎస్సీ-2008 అభ్యర్థుల నిరసన

ABOUT THE AUTHOR

...view details