ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మా ఇంటి మహాలక్ష్మి.. దత్తతలో అమ్మాయిల వైపే దంపతుల మొగ్గు - ఇండియాలో దత్తత న్యూస్

ఆడపిల్ల పుట్టిందని పొత్తిళ్లలో ఉండగానే చెత్తకుప్పల్లో వదిలేసే వారు ఒకవైపు ఉండగా... అమ్మాయి నట్టింట అడుగుపెడితే చాలు సాక్షాత్తూ మహాలక్ష్మే వచ్చిందని సంబరపడిపోతున్న దంపతులు మరోవైపు ఉన్నారు. రైతుల నుంచి వ్యాపారవేత్తల వరకు అన్ని వర్గాల వారు ఆడపిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తుండటం విశేషం. వారిలో సాఫ్ట్‌వేర్‌ నిపుణులు ముందుంటున్నారు. ఇవీ వివరాలు...

NRI'S intrest to adopt girls
NRI'S intrest to adopt girls

By

Published : Jul 11, 2020, 7:21 AM IST

ప్రవాసాంధ్రుల గొప్ప మనసు

తమ ఇళ్లలో సంతోషాలు నింపే చిన్నారుల కోసం ప్రవాసాంధ్రులూ దరఖాస్తు చేసుకుంటున్నారు. నిరుడు అయిదుగురిని స్పెయిన్‌, నలుగురిని మాల్టా, ముగ్గుర్ని అమెరికాకు చెందిన వారు, ఒక్కొక్కర్ని చొప్పున ఇటలీ, స్వీడన్‌, ఫ్రాన్స్‌ దేశాలలో ఉండే ప్రవాసాంధ్రులు దత్తత తీసుకున్నారు. ముఖ్యంగా ప్రత్యేక అవసరాల పిల్లలను అక్కున చేర్చుకునేందుకు వారు ఎక్కువగా ముందుకు వస్తున్నారని అధికారులు హర్షం వ్యక్తంచేశారు.

మారిన దృక్పథం... మమతకు ఆవాసం

ఇప్పటికే సంతానం ఉన్న వారూ తమ జీవితాల్లోకి అనాథలను ఆహ్వానిస్తున్నారు. ఏడాది కాలంలో 25 మంది వ్యాపారవేత్తలు, 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 15 మంది రైతులు, 11 మంది ఉపాధ్యాయులు, 10 మంది వివిధ కంపెనీల మేనేజర్లు, 10 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, నలుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు దత్తత తీసుకున్నారు. రెస్టారెంట్ల యజమానులు ముగ్గురు, వైద్యులు ఇద్దరు, దర్జీలు ముగ్గురు, ప్రైవేటు ఉద్యోగులు 8 మంది, బ్యాంకు ఉద్యోగులు అయిదుగురు ఉన్నారు.

832 మంది నుంచి అర్జీలు

ప్రస్తుతం శిశుగృహాల్లో 0-6 ఏళ్లలోపున్న 133 మంది చిన్నారులున్నారు. వీరిలో 72 మంది అమ్మాయిలు, 61 మంది అబ్బాయిలు. దత్తత కోసం ఏకంగా 832 అర్జీలు రాగా... 11 మంది పిల్లలను ఇప్పటికే రిజర్వు చేశారు. కరోనా కారణంగా దత్తత ప్రక్రియకు ఏప్రిల్‌ నుంచి అవరోధం ఏర్పడింది. దాంతో పిల్లల యోగక్షేమాలను ఆయా దంపతులు రోజూ ఫోన్ల ద్వారా తెలుసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details