NREGS Funds: ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల్లో నాలుగో విడతగా ఏపీకి 1,769 కోట్లను కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంజూరు చేసిందని పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్థిశాఖ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు. మొదటి విడతగా రూ.929 కోట్లు, రెండో విడతగా రూ.228 కోట్లు, మూడో విడతగా రూ.670 కోట్లు, నాలుగో విడతగా రూ.1,769 కోట్లను మంజూరు చేసిందని ఆయన తెలిపారు.
ఉపాధిహామీ వేతనాల కింద నాలుగో విడత నిధులు విడుదల
Funds Release: ఉపాధిహామీ వేతనాల కింద ఏపీకి నాలుగో విడత నిధులను కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రానికి కేంద్రం రూ.1,769 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు.
ఉపాధిహామీ వేతనాల కింద నాలుగో విడత నిధులు విడుదల
2022-23 ఆర్ధిక సంవత్సరంలో రూ.3,597 కోట్ల రూపాయల్ని మంజూరు చేసిందని వివరించారు. ఇప్పటి వరకూ రూ.1,352 కోట్ల రూపాయల రోజువారీ వేతనాలను లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశామని ఆయన తెలిపారు. మిగిలిన మొత్తాన్ని త్వరలోనే వేతనదారుల ఖాతాల్లోకి జమ చేస్తామని కోన శశిధర్ వెల్లడించారు.
ఇవీ చూడండి