యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇటీవలే ఇద్దరు సిబ్బందికి కొవిడ్ సోకగా.. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న వారికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.
యాదాద్రిలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు
తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో నేడు సాధారణ రద్దీ ఉంది. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న వారిలో 30 మందికి కొవిడ్ నిర్ధరణ కావడం వల్ల నిత్య పూజలను అంతరంగికంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
యాదాద్రిలో ఆర్జిత సేవలు రద్దు
ఇందులో 30 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అవ్వడం వల్ల ఆలయాన్ని, క్యూలైన్లను శానిటైజ్ చేశారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా మూడ్రోజుల పాటు ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.