ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో ఇద్దరు మాజీ అధికారులపై సీబీఐ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. విశ్రాంత ఐఏఎస్ జి.వెంకట్రామిరెడ్డి, గనులశాఖ విశ్రాంత సంచాలకుడు వి.డి.రాజగోపాల్‌పై ఎన్‌బీడబ్ల్యూ జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. రాంకీ కేసులో విచారణకు హాజరుకాని జి.వెంకట్రామిరెడ్డిపై, ఓఎంసీ కేసులో విచారణకు హాజరుకానందున రాజగోపాల్‌పై ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సీబీఐ కోర్టు వెల్లడించింది.
రాంకీ ఈడీ కేసులో జగన్, విజయసాయి డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసుల నుంచి తొలగించాలని జగన్, విజయసాయి కోరారు. ఈ కేసు విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. జగతి పబ్లికేషన్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు విచారణ జరిగింది.