ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

roads repair: అడుగు ముందుకు పడలేదు.. మరమ్మతులు జరగలేదు! - ఏపీలో రోడ్ల మరమ్మతుల వార్తలుట

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయరైంది. ఎన్​డీబీ(NDB) రుణంతో చేపట్టిన రహదారుల విస్తరణ ఏడు నెలలైనా అడుగు ముందుకు పడలేదు. దీంతో ఆ రోడ్లపై ప్రయాణానికి వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

roads repair
roads repair

By

Published : Nov 16, 2021, 8:52 AM IST

న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) రుణంతో చేపట్టిన రహదారుల విస్తరణలో ఏడు నెలలైనా అడుగు ముందుకు పడలేదు. ఎన్‌డీబీ(NDB) ప్రాజెక్ట్‌లో ఉండటంతో ఈ రహదారులు వర్షాలకు దెబ్బతిన్నా మరమ్మతులకు అవకాశం ఉండటం లేదు. దీంతో ఆ రోడ్లపై ప్రయాణానికి వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రాల మధ్య, మండల కేంద్రాలను జిల్లా కేంద్రంతో కలిపే రహదారుల్లో ఒక వరుసతో ఉన్నవాటిని రెండు వరుసలుగా విస్తరించేందుకు రూ.6,400 కోట్లతో ఎన్‌డీబీ ప్రాజెక్ట్‌ మంజూరైంది.

ఇందులో ఎన్‌డీబీ 70 శాతం రుణంగా ఇవ్వనుండగా, 30 శాతం రాష్ట్రం వెచ్చిస్తోంది. తొలి దశలో 1,243 కిలోమీటర్లకు జిల్లాకు ఓ ప్యాకేజీగా టెండర్లు పిలిచి, గుత్తేదారులతో మార్చిలో ఒప్పందం చేసుకున్నారు. గత నెల నాటికి ఈ పనుల్లో 10 శాతం పూర్తికావాలి. కానీ ఏ జిల్లాల్లోనూ ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు. మరోవైపు రెండేళ్లుగా వానలకు ఈ రహదారులన్నీ అధ్వానంగా మారాయి. అయితే వీటిని విస్తరించాల్సి ఉన్నందున.. తాత్కాలికంగా గుంతలు పూడ్చి, మరమ్మతులు చేసేందుకు వీలులేదని ఇంజినీర్లు పేర్కొంటున్నారు.

తెరుచుకోని ప్రత్యేక ఖాతా..
ఎన్‌డీబీ రుణంగా ఇచ్చే మొత్తం కోసం ప్రత్యేక ఖాతా తెరవాలని డైరెక్టరేట్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌ (డీఈఏ) ఆదేశించింది. సీఎం ఆదేశించినప్పటికీ, ఆర్థికశాఖ నుంచి ఇప్పటి వరకు ఆమోదం లభించలేదు. దీంతో ఈ పనులు చేస్తే, సకాలంలో బిల్లులు వస్తాయా లేదా అనేది స్పష్టత లేదని గుత్తేదారులు చెబుతున్నారు.

డీపీఆర్‌ లెవెల్స్‌లో వ్యత్యాసాలు..
ఈ ప్రాజెక్ట్‌ మంజూరైన సమయంలో సలహా సంస్థల ద్వారా రహదారుల వారీగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)లు సిద్ధం చేయించారు. ఏయే రహదారిలో ఎక్కడెక్కడ ఎంత ఎత్తు, వెడల్పు ఉండాలి, వంతెనలు, కల్వర్టుల నిర్మాణం తదితరాలకు తాత్కాలిక బెంచ్‌ మార్క్‌ (డీబీఎం) వేస్తారు. దీని ప్రకారమే పనులు జరగాలి. వీటి ఆధారంగానే టెండర్లు పిలిచి, గుత్తేదారులకు పనులు అప్పగించారు. గుత్తేదారులు పనులు చేసేందుకు సిద్ధం కాగా.. క్షేత్రస్థాయిలో వాటి లెవెల్స్‌లో తేడాలు ఉన్నట్లు బయటపడుతోంది. వీటిని సరిచేశాకే పనులు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ నాణ్యత, నియంత్రణ విభాగం ఆదేశించినట్లు తెలిసింది. దీంతో పలు జిల్లాల్లో ఇంజినీర్లు, సలహా సంస్థల ప్రతినిధులు, గుత్తేదారులు సంయుక్తంగా మళ్లీ పరిశీలన చేస్తున్నారు.

ఇదీ చదవండి

కుమారుడి పెళ్లి కోసం.. సొంత సొమ్ముతో రహదారికి మరమ్మతులు

ABOUT THE AUTHOR

...view details