ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Mariyamma Case: మరియమ్మ కేసు సీబీఐకి వద్దు: ఏజీ

తెలంగాణలో సంచలనం సృష్టించిన మరియమ్మ కస్టోడియల్ డెత్‌పై (Ts high court on Mariyamma case) హైకోర్టులో విచారణ జరిగింది.

మరియమ్మ కేసు సీబీఐకి వద్దు: ఏజీ
మరియమ్మ కేసు సీబీఐకి వద్దు: ఏజీ

By

Published : Nov 23, 2021, 7:45 AM IST

మరియమ్మ కస్టోడియల్ డెత్‌పై (Ts high court on Mariyamma case) హైకోర్టులో విచారణ జరిగింది. ఇందుకు సీబీఐ ఎస్పీ కల్యాణ్‌, రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ హాజరయ్యారు.

సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదంటూ..

ఎన్​హెచ్​ఆర్​సీ మార్గదర్శకాల ప్రకారమే దర్యాప్తు జరిపామని.. ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదంటూ అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. ఈ కేసులో భాగంగా ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపిన ఏజీ.. ఇంకా ఎవరైనా బాధ్యులుగా తేలితే వారిపైనా చర్యలున్నాయని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మరియమ్మ మృతిపై సీఐడీ దర్యాప్తునకు సిద్ధమన్న ఏజీ.. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI)కు అప్పగిస్తే రాష్ట్ర పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బతింటుందన్నారు. ఈ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్​ చేసింది.

అసలు ఏం జరిగిందంటే..

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ పోలీస్​స్టేషన్‌ పరిధిలోని ఓ పాస్టర్​ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడకు చెందిన మరియమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ పేరుతో.. మరియమ్మను పోలీసులు కొట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. జూన్​ 18న మరియమ్మ పోలీస్​స్టేషన్​లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తీవ్రస్థాయిలో ఆందోళనలు వెల్లువెత్తగా.. పోలీసుల వైఖరిపై సీఎం కేసీఆర్​ ఫైరయ్యారు. బాధ్యులైన పోలీసులను విధుల నుంచి తొలిగించాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు. ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను అధికారులు డిస్మిస్​ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున నగదు పరిహారంతో పాటు.. మరియమ్మ కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు.

మరో ఘటన..

ఈనెల 4న ఆత్మకూరు‌ (ఎస్‌) మండలం ఏపూరులోని బెల్టు షాపులో... 10వేల నగదు, 40 క్వార్టర్‌ సీసాల చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసు విచారణలో స్థానిక ఎస్సై లింగం సిబ్బంది వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసులో కేవలం అనుమానితుడిగా ఉన్న ఓ యువకుడిని తీసుకొచ్చి చితకబాదిన తీరు... ఎస్సై అత్యుత్సాహానికి అరాచక వ్యవహారానికి అద్దం పడుతోంది. లింగం వ్యవహారశైలి ఆది నుంచీ ఇలాగే ఉందని... సూర్యాపేట జిల్లాలోని పలువురు పోలీసు అధికారులు అంటున్నారు. హైదరాబాద్‌తో పాటు సూర్యాపేట జిల్లాలోని నూతనకల్, నాగారంలో పనిచేసినప్పుడూ... వ్యవహారశైలితో ఎస్సై వివాదాస్పదమయ్యారు. నాగారంలో ఒక వ్యక్తిని దారుణంగా కొట్టడంతో... అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడి ప్రజల ఆందోళనతో లింగంను వీఆర్‌కు పంపించారు. కొన్ని నెలల తర్వాత ఆత్మకూరులో పోస్టింగ్ ఇచ్చారు. బుధవారం మళ్లీ యువకుడిని చితకబాదిన ఘటన.. అతడి సస్పెన్షన్‌కు దారి తీసింది.

ఇదీ చదవండి:Repeal three capital laws: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 3 రాజధానుల చట్టం ఉపసంహరణ

ABOUT THE AUTHOR

...view details