ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆరెస్సెస్ లేనిది భాజపా లేదు: రామచంద్రమూర్తి - K. Ramachandra murthy latest news

విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో... 'దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు-కాంగ్రెస్ పార్టీ కర్తవ్యం' అంశంపై ప్రభుత్వ మాజీ సలహాదారు రామచంద్రమూర్తి స్మారకోపన్యాసం చేశారు. ఆరెస్సెస్ లేనిది భాజపా లేదని... కేవలం 38 శాతం ఓటింగ్​తో భాజపా అధికారంలోకి వచ్చిందని వివరించారు.

No BJP without RSS: Ramachandramurthy
రామచంద్రమూర్తి

By

Published : Sep 2, 2020, 3:25 PM IST

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో... 'దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు-కాంగ్రెస్ పార్టీ కర్తవ్యం' అంశంపై ప్రభుత్వ మాజీ సలహాదారు రామచంద్రమూర్తి స్మారకోపన్యాసం చేశారు. 2014లో దేశంలో వచ్చిన పెను మార్పులతో భాజపా అధికారంలోకి వచ్చిందని రామచంద్రమూర్తి అన్నారు.

అడ్వాణిని పక్కనపెట్టి భాజపా ప్రధాని అభ్యర్థిని, యూపీ ముఖ్యమంత్రిని కూడా నిర్ణయించింది ఆరెస్సెస్ అని పేర్కొన్నారు. ఆరెస్సెస్ లేనిది భాజపా లేదని... కేవలం 38 శాతం ఓటింగ్​తో భాజపా అధికారంలోకి వచ్చిందన్నారు. సెక్యూలరిజంతో హిందూవాదులను కాంగ్రెస్ పార్టీ తమ ఓట్ బ్యాంకుగా మార్చుకోలేకపోయిందని వివరించారు. భాజపా హిందూత్వం పేరుతో.. హిందువులను తమ ఓట్ బ్యాంకుగా మలుచుకోవడంలో సఫలీకృతమయ్యిందని చెప్పారు.

ఇదీ చదవండీ... ఏపీలో 54.96 శాతం పెరిగిన రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు

ABOUT THE AUTHOR

...view details