APSRTC : విలీనం అనంతరం ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని మరోమారు కోరారు. ఆర్టీసీ కార్మికులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఎన్‌ఎంయూ మహాసభ ద్వారా తమ గోడును ప్రభుత్వానికి విన్నవించారు. పీఆర్సీ అమలు, పదోన్నతులు ఇవ్వాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల కోసం ప్రభుత్వం రూపొందించిన సర్వీసు రూల్స్ వల్ల ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని.. వెంటనే వాటిని సరి చేయాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసిన అనంతరం తొలిసారి ఆర్టీసీ ప్రధాన ఉద్యోగ సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ మహాసభను విజయవాడలో నిర్వహించారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఎన్‌ఎంయూ మహాసభ.. 9 తీర్మానాలతో సీఎం జగన్‌కి వినతి పత్రం
NMU MAHASABHA : ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నేషనల్ మజూర్ద్ యూనియన్ మహాసభ ద్వారా ప్రభుత్వానికి విన్నవించారు. ప్రధాన సమస్యలపై 9 తీర్మానాలు చేసి.. సీఎంకు వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు.
NMU mahasabha at vijayawada
ఆర్టీసీ కార్మికులకు ఈహెచ్ఎస్ కార్డులు వద్దని, గతంలో ఉన్నవిధంగా ఆర్టీసీ సంస్థ ఆస్పత్రుల ద్వారా అపరిమిత వైద్యం అందించాలని కోరారు. ఎంతో కాలంగా వేచి చూస్తున్నా పలు కీలక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని.. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని సత్వరమే పరిష్కరించాలని నేతలు కోరారు. ఉద్యోగుల ప్రధాన సమస్యలపై 9 తీర్మానాలు చేసిన ఎన్‌ఎంయూ మహాసభ దీన్ని సత్వరమే పరిష్కరించాలని కోరారు.
ఇవీ చదవండి: