భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రామచంద్రస్వామి శ్రీకృష్ణావతారంలో దర్శనం ఇవ్వడంతో భక్తులు పరమానందభరితులై చేతులెత్తి మొక్కుకున్నారు. మహానివేదన అనంతరం స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించనున్నారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ సకల రాజలాంఛనాలతో స్వామి వారిని చిత్రకూట మండపం వద్దకు తీసుకువెళ్తారు. అక్కడ వేచి ఉన్న భక్తులకు దర్శనమిస్తారు.
శ్రీకృష్ణావతారంలో రామచంద్రుడు.. పరవశించిపోయిన భక్తులు
తెలంగాణలోని భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా తొమ్మిదో రోజైన బుధవారం రామచంద్రస్వామి.. శ్రీకృష్ణుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీకృష్ణావతారంలో రామచంద్రుడు.. పరవశించిపోయిన భక్తులు
శ్రీకృష్ణుడి అవతారంలో కంసుడు, శిశుపాలుడు, నరకాసురుడిని వధించాడు. మహాభారత యుద్ధంలో పాండవుల పక్షాన నిలిచి.. గీతా సారాన్ని ఉపదేశించి విజేతలుగా నిలిపి, లోకానికి దారి చూపాడని పండితులు కొనియాడారు.
ఇవీ చూడండి:అనపర్తి రాజకీయం.. సత్యప్రమాణాలతో గరం గరం