Navaratri: విజయవాడ ఇంద్రకీలాద్రి పై శరన్నవరాత్రుల్లో భాగంగా 9వ రోజైన నిజ ఆశ్వయుజ శుద్ధనవమి నాడు జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ మహిషాసురమర్థినీ దేవిగా దర్శనమిస్తోంది. మహిషాసురుడిని అమ్మవారు సంహరించింది ఈ రూపంలోనే. నవదుర్గ రూపాల్లో ఈ రూపమే మహోగ్రరూపం. ఈ రోజున జగన్మాత కనకదుర్గమ్మ లేతరంగు దుస్తుల్లో సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన మహాశక్తిగా భక్తులను సాక్షాత్కరిస్తుంది. ఇంద్రకీలాద్రిపై రేపటితో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి.
తొమ్మిదో రోజు మహిషాసురమర్థిని దేవిగా.. విజయవాడ కనకదుర్గమ్మ - దసరా ఉత్సవాలు
Navaratri: ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో తమ్మిదో రోజైన ఈ రోజు అమ్మవారు భక్తులకు మహోగ్రరూపంలో దర్శనం ఇస్తోంది.
విజయవాడ కనకదుర్గమ్మ