శాసనసభ వేదికగా పోలవరంపై సీఎం జగన్ పచ్చి అబద్ధాలు చెప్పారని తెదేపా నేత నిమ్మల రామా నాయుడు మండిపడ్డారు. కేసుల భయంతోనే పోలవరాన్ని, ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి జగన్ గాలికి వదిలేశారని విమర్శించారు. 28 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేకహోదా, పోలవరం సాధిస్తానని ఎందుకు ప్రగల్భాలు పలికారని సీఎం జగన్ను నిలదీశారు.
పోలవరం ఎత్తు తగ్గించే ఆలోచన లేదంటున్న ముఖ్యమంత్రి.. గతంలో కేసీఆర్ వ్యాఖ్యల్ని ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. పోలవరం విషయంలో ముఖ్యమంత్రి ఆడుతున్న నాటకాలు రాష్ట్ర రైతాంగానికి శాపంగా మారనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.