ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్‌ను బాధ్యతల నుంచి తొలగించటంపై తెదేపా ఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్... కరోనాను అరికట్టేందు ఏం చేయాలో నిర్ణయించకుండా... ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించినవారిపై కక్షసాధింపు చర్యలు చేయటం దురదృష్టకరమన్నారు. ఎన్నికల కమిషనర్‌ను అప్రజాస్వామికంగా తొలగించారని ఆగ్రహించారు. ఈ నిర్ణయంతో రాజ్యాంగానికి తూట్లు పొడిచారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
'ఎస్ఈసీ తొలగింపు అప్రజాస్వామిక చర్య' - nimmala ramanaiud speech about removing of SEC
ప్రపంచమంతా కరోనాపై పోరాటం చేస్తుంటే సీఎం జగన్ ఒక్కరే ఎన్నికల కమిషనర్ పై పోరాటం చేశారని తెదేపా ఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు దుయ్యబట్టారు. అప్రజాస్వామికంగా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
!['ఎస్ఈసీ తొలగింపు అప్రజాస్వామిక చర్య' nimmala ramanaiud speech about removing of SEC](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6747950-862-6747950-1586587991635.jpg)
ఎస్ఈసీ తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిమ్మలరామానాయుడు
ఎస్ఈసీ తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిమ్మలరామానాయుడు