తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధమైన ఘటనపై వైకాపా మంత్రులు మతిస్థిమితం లేని.. వారి పని, తేనె పట్టుకోసం చేసిన పని అంటే హాస్యాస్పదంగా ఉందని నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రజాగ్రహాన్ని చవిచూశారన్నారు. రథం దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించడానికి వెళ్లిన మంత్రులను వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు నిలదీశారన్న చినరాజప్ప... ఈ ఘటనలో కుట్రకోణం ఉందని.. సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
రథం దగ్ధంపై మంత్రుల మాటలు హాస్యాస్పదం: చినరాజప్ప
వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందు దేవాలయాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. తెదేపా ప్రభుత్వం హయాంలో చంద్రబాబు అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు.
nimmakayala chinnarajappa comments on ysrcp govt