తెదేపా అధినేత చంద్రబాబుపై ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుపై ధర్మాన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎవరూ ఉచ్ఛరించలేని విధంగా మాట్లాడటం హేయమన్నారు. ధర్మాన అసభ్య పదజాలం ఉపయోగించడం విస్మయం కలిగిస్తోందని ఆవేదన చెందారు. అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులన్న కృష్ణదాస్ వెంటనే వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
'ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అలాంటి వ్యాఖ్యలా చేసేది' - ధర్మాన కృష్ణదాస్‌పై చినరాజప్ప ఆగ్రహం వార్తలు
ఉపముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ధర్మాన కృష్ణదాస్ తెదేపా అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమని ఆ పార్టీ నేత నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. ఆయన అమరావతి రైతులపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు.
నిమ్మకాయల చినరాజప్ప, తెదేపా నేత