ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భాజపా నేతలు.. వైకాపా అద్దె మైకుల్లా మారారు: చినరాజప్ప - బీజేపీ నేతలపై చినరాజప్ప కామెంట్స్

సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి వైకాపా అద్దె మైకుల్లా మారారని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. అధికారంలో ఉన్న వైకాపాను పల్లెత్తు మాట అనకుండా ప్రతిపక్షంలోని తెలుగుదేశం పార్టీని విమర్శించడం దేనికి సంకేతమని ధ్వజమెత్తారు.

nimmakayala chinarajappa comments on bjp leaders
nimmakayala chinarajappa comments on bjp leaders

By

Published : Sep 8, 2020, 11:48 PM IST

తెలుగుదేశం పార్టీని విమర్శించడం మీద పెట్టిన శ్రద్ధ ప్రజా సమస్యల మీద భాజపా నేతలు ఎందుకు చూపడం లేదని.. తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో దశాబ్ద కాలం నాటి రథం దగ్ధమైతే భాజపా నాయకులు ఎందుకు చూడటానికి వెళ్లలేదని నిలదీశారు.

ఇళ్ల పట్టాల్లో జరుగుతున్న అవినీతి గురించి గానీ, మద్యం, ఇసుక, భూ కుంభకోణాల్లో మీరు ఒక్కరోజైనా వైకాపా నాయకులను పల్తెత్తు మాటైనా అన్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్నా.. కళ్లు ఉండి చూడలేని కబోదుల్లా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రైతులను నట్టేట ముంచేలా తీసుకువస్తున్న విద్యుత్ మోటర్ల గురించి ఎందుకు వ్యతిరేకించడం లేదని చినరాజప్ప ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details