వైకాపా ప్రభుత్వం అంతా దోపిడీమయమని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఫిర్యాదు చేసేందుకు సామాన్యుడు పోలీస్ స్టేషన్కు వెళ్తే.. తిరిగి వారి మీదే కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జస్టిస్ రామకృష్ణపై వైకాపా కార్యకర్తల దాడులను తీవ్రంగా ఖండించారు.
'వైకాపా ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను అణగదొక్కాలని చూస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలపై దాడులు ఎక్కువయ్యాయి. పోలీసులు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్నారు. వైకాపా కార్యకర్తలు సామాన్య ప్రజలను సైతం ఇబ్బందిపెడుతున్నారు.' - చినరాజప్ప, తెదేపా నేత