ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటినుంచి.. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ! - ap latest news

Night curfew in AP: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి రాత్రి కర్ఫ్యూ నిబంధనలు అమలులోకి రానున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు ఈ ఆంక్షలు అమలు చేయనున్నారు.

night curfew in ap
నేటి నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలు

By

Published : Jan 18, 2022, 6:33 AM IST

Updated : Jan 18, 2022, 7:22 PM IST

Night curfew in AP: రాష్ట్రంలో ఇవాళ రాత్రి నుంచి కర్ఫ్యూ నిబంధనలు అమలులోకి రానున్నాయి. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలుచేయనున్నారు. వివాహాలు, మతపరమైన, సామాజిక పరమైన కార్యక్రమాలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించడంపైనా ఆంక్షలు విధించింది ప్రభుత్వం. బహిరంగ కార్యక్రమాల్లో.. గరిష్ఠంగా 200 మంది, హాళ్లలో అయితే 100 మందికే అనుమతి ఉంటుంది. అయితే.. అంతర్‌రాష్ట్ర, రాష్ట్ర సరకు రవాణా వాహనాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది.

4,108 మందికి పాజిటివ్‌..
ఏపీలో ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య 22,882 నమూనాలను పరీక్షించగా.. 4,108 కేసులు బయటపడ్డాయి. దీంతో పాజిటివిటీ రేటు 17.95%గా నమోదైంది. ఈ నెల 1న పాజిటివిటీ రేటు 0.57%గా నమోదు కావడం గమనించాల్సిన అంశం.

Last Updated : Jan 18, 2022, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details