ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NIA: ముంద్రాపోర్టు డ్రగ్స్‌ కేసు.. విజయవాడలో ఎన్‌ఐఏ సోదాలు

డ్రగ్స్ విషయమై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ ముమ్మరం చేసింది. విజయవాడ, చెన్నై, కోయంబత్తూర్‌లో సోదాలు చేపట్టింది. సోదాల్లో భాగంగా పలువురిని విచారించిన ఎన్‌ఐఏ అధికారులు.. కీలక పత్రాలు, సామగ్రి సీజ్‌ చేశారు.

NIA probes in Vijayawada
NIA probes in Vijayawada

By

Published : Oct 10, 2021, 6:31 AM IST

ముంద్రా పోర్టు డ్రగ్స్‌ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. విజయవాడ, చెన్నై, కోయంబత్తూర్‌లో ఇవాళ ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. సోదాల్లో భాగంగా ఎన్‌ఐఏ అధికారులు కీలక పత్రాలు, సామగ్రి సీజ్‌ చేశారు. ఇటీవల ముంద్రాపోర్టులో 2,988 కిలోల హెరాయిన్‌ పట్టుబడిన విషయం తెలిసిందే. హెరాయిన్‌ పట్టివేత కేసును రెండ్రోజుల క్రితం ఎన్‌ఐఏ స్వీకరించింది. ఎన్‌డీపీఎస్‌, చట్టవ్యతిరేక చర్యల కింద ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. అఫ్గాన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా ముంద్రా పోర్టుకు హెరాయిన్‌ సరఫరా అయినట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు అరెస్టు చేసిన నిందితులను వెంటబెట్టుకుని 3 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది ఎన్‌ఐఏ. నిందితులుగా ఉన్న మాచవరం సుధాకర్‌, గోవిందరాజు, రాజ్‌కుమార్‌లకు సంబంధించిన 3 నగరాల్లోని పలు ప్రదేశాల్లో సోదాలు జరిపినట్టు ఎన్ఐఏ వెల్లడించింది.

వాంగ్మూలం నమోదు చేసుకుని..
విజయవాడ సత్యనారాయణపురం గడియారం వారి వీధిలోని ఇంటి నెంబర్ 23-14-16 చిరునామాతో మాచవరం సుధాకర్ ఆషీ ట్రేడింగ్ కంపెనీని రిజిస్ట్రర్ చేశారు. ఇది ఆయన భార్య దుర్గా పూర్ణిమా వైశాలి పుట్టినిల్లు. ఎన్ఐఏ అధికారులు ఆ ఇంట్లో సోదాలు చేశారు. స్థానికులను విచారించి వాంగ్మూలాలు తీసుకున్నారు. ఆషీ ట్రేడింగ్ కంపెనీ ఎప్పుడు ప్రారంభమైంది? అక్కడికి సరుకులు ఏమైనా వచ్చేవా? సుధాకర్, ఆయన భార్య ఆ ఇంట్లో ఉండేవారా? ఎన్నాళ్లకోసారి అక్కడికి వచ్చేవారు? వంటి విషయాలు అడిగి తెసుకున్నారు. ఆ కంపెనీ దిగుమతుల వివరాలు జీఎస్టీ అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు.

చెన్నై, కోయంబత్తూరుల్లోనూ..
చెన్నై శివారుల్లో కోలపక్కల వీవోసీ వీధిలోని ఓ అపార్ట్​మెంట్లో సుధాకర్, వైశాలి ఉండేవారని ఎన్ఐఏ అధికారులు తెలుసుకున్నారు. ఆ అపార్ట్​మెంట్లో ఎన్​ఐఏ అధికారులు సోదా చేసి.. పలు పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిని మాదవద్రవ్యాల అక్రమ రవాణా, తద్వారా ఉగ్ర ఉచ్చులోకి దించిన కోయంబత్తుర్ వాసి రాజ్ కుమార్ ఇల్లు, కార్యాలయాల్లోనూ సోదాలు చేశారు.

ఇదీ చదవండి:సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌పై తీసుకున్న చర్యలేంటి.. ? : కేంద్ర హోంశాఖ

ABOUT THE AUTHOR

...view details