తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి శాస్త్రీయంగా చర్యలు తీసుకోకపోవడంపై ఎన్‌హెచ్చార్సీ(NHRC) ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక సమర్పించాలని గతేడాది డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లను ఆదేశించింది. ఆత్మహత్యల కట్టడికి తీసుకున్న శాస్త్రీయ చర్యలు తెలపకపోవడంపై ఆగ్రహం వెలిబుచ్చింది. ఆరు వారాల్లోగా సమగ్ర నివేదిక అందించాలని మరోసారి ఆదేశించింది.
NHRC: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఎన్‌హెచ్చార్సీ ఆగ్రహం
13:55 August 14
ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం
నివేదిక ఇవ్వకపోతే NHRC ఎదుట హాజరుకావాల్సి వస్తుందని హెచ్చరించింది. 2019 రికార్డుల ప్రకారం 426 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్న ఎన్‌హెచ్చార్సీ..తెలంగాణలో ఒకే వారంలో 22 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని పేర్కొంది. ఆత్మహత్యల నివారణకు తీసుకుంటున్న చర్యలు సరిపోవన్న జాతీయ మానవ హక్కుల కమిషన్..ఆంధ్రప్రదేశ్‌లో 383 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపింది. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆత్మహత్యలపై సుప్రీం న్యాయవాది చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆదేశాలు జారీచేసింది.
ఇదీ చదవండి:
Sunitha letter reaction: మణికంఠరెడ్డిని విచారిస్తున్న పోలీసులు