ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో రెండు రోజులు.. భారీ నుంచి అతి భారీ వర్షాలు - హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వార్తలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వర్షాలతో అప్రమత్తమైన యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

తెలంగాణలో రెండు రోజులు.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
తెలంగాణలో రెండు రోజులు.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

By

Published : Oct 12, 2020, 9:25 PM IST

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలోని నర్సాపూర్‌కు తూర్పు అగ్నేయ దిశగా 360 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఇది రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అయన అన్నారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆయన వివరించారు.

తెలంగాణలో ఈరోజు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంగళవారం తెల్లవారుజామున వాయుగుండం తీరాన్ని దాటిన తర్వాత రాష్ట్రం గుండా ప్రయాణించే అవకాశం ఉందన్నారు. అందువల్ల రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రాజారావు వెల్లడించారు. ఈ రోజు కోస్తా తీరం వెంబడి ఈదురు గాలులు గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో.. ఒక్కొక్కసారి 65 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details