ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలుగు రాష్ట్రాల్లో మూడురోజుల పాటు వర్షాలు

ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

next-three-days-rains-in-telugu-states
next-three-days-rains-in-telugu-states

By

Published : May 31, 2020, 4:44 PM IST

Updated : May 31, 2020, 6:19 PM IST

తెలుగు రాష్ట్రాల్లో మూడురోజుల పాటు వర్షాలు

ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో అది వాయుగుండముగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తరువాత 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని, జూన్ 3 నాటికి ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ తీరాలకు చేరే అవకాశం ఉందని ప్రకటించింది.

ఈదురుగాలులతో కూడిన..

తెలంగాణ, రాయలసీమ, దక్షిణ మధ్య కర్ణాటక మీదుగా లక్ష దీవుల వరకు ఉపరితల ద్రోణి ఉంటుదని సమాచారం. ఛత్తీస్‌గఢ్ నుంచి లక్షద్వీప్ మీదుగా తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కర్ణాటక, కేరళలో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. రెండు రోజులలో దక్షిణ తీరప్రాంతాలు, ఏపీ, యానాం, రాయలసీమ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నైరుతి రుతుపవనాలు రేపు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో రాగల మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు పడొచ్చని, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్న తెలిపారు.

ఇదీ చూడండి :ప్రత్యేక రైళ్లలో వేళ్లేవారు ఆ సూచనలు పాటించాలి

Last Updated : May 31, 2020, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details