ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RTC Buses: 'ఆర్టీసీలో కొత్తగా 998 అద్దె బస్సులు'

RTC Buses: రాష్ట్రంలో కొత్తగా 998 బస్సుల్ని కొత్తగా అద్దెకు తీసుకుంటున్నట్లు రవాణాశాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ తెలిపారు. ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సుల్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన తొలి దస్త్రంపై ఆయన సంతకం చేశారు.

newly 998 rtc buses are being rented says minister pinepe vishwaroop
ఆర్టీసీలో కొత్తగా 998 అద్దె బస్సులు

By

Published : Apr 13, 2022, 7:18 AM IST

RTC Buses: ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సుల్ని తగ్గించేందుకు.. 998 బస్సుల్ని కొత్తగా అద్దెకు తీసుకుంటున్నట్లు రవాణాశాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన తొలి దస్త్రంపై ఆయన సంతకం చేశారు. తిరుమలలో 100 ఎలక్ట్రిక్‌ బస్సుల్ని నడపాలని నిర్ణయించామని వెల్లడించారు. సచివాలయంలో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతలు స్వీకరిస్తున్న మంత్రి పినిపె విశ్వరూప్

ప్రైవేటు ట్రాన్స్‌పోర్టుల ఆగడాలను అరికట్టి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆటోలు, ట్రాక్టర్లు నడిపే సామాన్య ప్రజల విషయంలో బలవంతపు వసూళ్లు జరగకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పరిస్థితులు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ABOUT THE AUTHOR

...view details