ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజ్‌భవన్‌లో ఈ ఏడాది 'ఓపెన్ హౌస్' రద్దు - రాజ్​భవన్ తాజా వార్తలు

నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. రాజ్​భవన్​లో ప్రతి ఏడాది నిర్వహించే ఓపెన్ హౌస్​ను ఈ ఏడాది రద్దు చేశారు. ఈ మేరకు గవర్నర్ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

new year celebrations cancelled in rajbhavan
రాజ్‌భవన్‌లో ప్రతి ఏడాది నిర్వహించే 'ఓపెన్ హౌస్' రద్దు

By

Published : Dec 29, 2020, 10:41 PM IST

నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నిర్వహించే 'ఓపెన్ హౌస్'ను ఈ ఏడాది రద్దు చేశారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం.. ఆహ్లాదకరమైన సమయాన్ని గవర్నర్‌తో పంచుకోవటం చాలా ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం.

ప్రస్తుత పరిస్థితుల్లో ఓపెన్ హౌస్​తో సహా నూతన వేడుకలను నిర్వహించట్లేదని గవర్నర్ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు, పౌర సమాజంలోని ప్రముఖులు నూతన సంవత్సరానికి సంబంధించి ఈ మార్పును గుర్తించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్ మార్గదర్శకాల మేరకు నూతన సంవత్స వేడుకలను జరుపుకోవాలని ప్రజలకు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details