ఇవాళ అమ్మవారి అలంకరణలో పచ్చలు పొదిగిన హారాలను వినియోగించాలని నిర్ణయించారు. సోమవారం-ముత్యాలు, మంగళవారం-పగడాలు, బుధవారం-పచ్చలు, గరువారం-పుష్యరాగాలు, శుక్రవారం-వజ్రాలు, శనివారం-నీలాలు, ఆదివారం-కెంపులు పొదిగిన హారాలను అలంకరించనున్నారు. అమ్మవారి అలంకరణకు సంబంధించి.. దాతలు ఆసక్తి ఉంటే దేవస్థానంలోని డొనేషన్ కౌంటరులో సంప్రదించాలని దేవస్థానం ఈవో సురేష్‌బాబు తెలిపారు.
నేటి నుంచి దుర్గమ్మకు ఏడు వారాల నగలు అలంకరణ - విజయవాడ కనకదుర్గకు ఏడువారాల నగలు న్యూస్
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు ఇవాళ నుంచి ఏడువారాల నగలు అలంకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి అలంకరణ నిత్యనూతనంగా ఉండేలా ఏడువారాల నగలు కనిపించేందుకు దాతల సహకారాన్ని కూడా దేవస్థానం అధికారులు కోరుతున్నారు.
new ornaments to vijayawada kanakadurga