ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

త్వరలో నూతన పారిశ్రామిక విధానం - నూతన పారిశ్రామిక విధానంపై చర్చ న్యూస్

రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ మేరకు పరిశ్రమల శాఖ వివిధ ప్రభుత్వ విభాగాలు, శాఖల నుంచి అభిప్రాయాలను, సూచనలను సేకరిస్తోంది.

new industria policy in ap
new industria policy in ap

By

Published : Jan 30, 2020, 5:21 AM IST

నూతన పారిశ్రామిక విధానం రూపకల్పన చేసి.. పెట్టుబడులు ఆకర్శించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం అన్ని ప్రభుత్వ శాఖల ప్రతిపాదనలు తీసుకొని వాటిలో ఉత్తమమైన వాటిని పారిశ్రామిక విధానంలో పొందుపరిస్తే పెట్టుబడులను ఆకర్షించటం సులువవుతుందని సర్కారు అభిప్రాయం. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్​మెంట్, ఎక్స్​పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2020-25 రూపకల్పనపై సమీక్ష నిర్వహించిన మంత్రి గౌతమ్ రెడ్డి... ఉపాధి, సాంకేతికత పెంపు, పర్యావరణహిత ప్రాజెక్టులు, మెరుగైన ఆదాయం కల్పించేందుకు వీలుగా నూతన పారిశ్రామిక విధానం ఉండాలని అధికారులకు సూచించారు. దేశవిదేశాలకు చెందిన పెట్టుబడులను ఆకర్షించేందుకు అవసరమైన ప్రతిపాదనలు చేయాలని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details