ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"నూతన విద్యావిధానం" రాజ్యాంగ బద్దంగా ఉండాలి : ఎస్​ఐఓ - "నూతన విద్యావిధానం" రాజ్యాంగ బద్దంగా ఉండాలి : ఎస్ఈవో

కేంద్ర నూతన విద్యావిధానంపై రూపొందించిన విధివిధానంలో హిందీ,సంస్కృతాలతో పాటుగా ఉర్దూ బాషాకు ప్రాధాన్యత ఇవ్వాలని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అస్గర్ అన్నారు.

"నూతన విద్యావిధానం" రాజ్యాంగ బద్దంగా ఉండాలి : ఎస్​ఐఓ

By

Published : Jul 31, 2019, 12:39 AM IST

నూతన విద్యా విధానం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలపై సలహాలు సంప్రదింపులు కోరిందని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అస్గర్ అన్నారు. విజయవాడలో అస్గర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యా విధానంలో హిందీ,సంస్కృతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. వాటితో పాటు ఉర్దూకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ విధానం రాజ్యాంగ బద్ధంగా ఉండాలనే తమ ప్రధాన డిమాండ్ అని తెలిపారు. విద్యను వ్యాపార కోణం కాకుండా ప్రాధమిక హక్కుగా భావించాలన్నారు.అందరికి అందుబాటులో అన్ని వర్గాలకి సమానంగా విద్య ఉండాలన్నారు.ప్రతి ఒక్కరికి చదువు ప్రాథమిక హక్కు అని దానిని తప్పకుండా అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధానాల్లో ఫీజు నియంత్రణపై స్పష్టత లేదన్నారు. కేంద్రీయ విద్యా సంస్థలు కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడిచేలా ఉన్నాయని వాటిని స్వతంత్ర సంస్థలుగా పరిగణించాలని కోరారు.

"నూతన విద్యావిధానం" రాజ్యాంగ బద్దంగా ఉండాలి : ఎస్​ఐఓ
ఇదీ చదవండి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details