న్యూ దిల్లీ-చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు విజయవాడ చేరుకుంది. దిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా ఎక్స్‌ప్రెస్ రైలు విజయవాడకు వచ్చింది. దిల్లీ సహా వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు 318 మంది ప్రయాణికులు వచ్చారు. వారికి పరీక్షలు చేశాక ప్రత్యేక బస్సుల్లో క్వారంటైన్ కేంద్రాలకు తరలించనున్నారు. ప్రత్యేక బస్సుల్లో వారిని సొంత జిల్లాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 14రోజుల పాటు ఆయా ప్రాంతాల్లోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచి సొంతింటికి పంపిస్తారు.
విజయవాడ చేరుకున్న తొలి ప్రయాణికుల రైలు - విజయవాడ చేరుకున్న ప్రయాణికుల రైలు న్యూస్
లాక్‌డౌన్ తర్వాత విజయవాడకు తొలి ప్రయాణికుల రైలు చేరుకుంది. దిల్లీ సహా వివిధ రాష్ట్రాల నుంచి 318 మంది ప్రయాణికులు విజయవాడకు చేరుకున్నారు.
new delhi-chennai express reached to vijayawada railway station
ఇదే రైలులో విజయవాడ నుంచి 282 మంది ప్రయాణికులు చెన్నై వెళ్లారు. చెన్నై వెళ్లే ప్రయాణికులకు ముందుగానే రైల్వే అధికారులు పరీక్షలు చేయించారు. రిజర్వేషన్ చేయించుకున్నవారికి మాత్రమే స్టేషన్ లోపలికి అనుమతించారు.
ఇదీ చదవండి: జూన్ 30 వరకు బుక్ చేసుకున్న రైలు టికెట్లు రద్దు