ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 282 కరోనా కేసులు, ఒకరు మృతి - న్యూ కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 282 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 442 మంది కోలుకోగా.. ఒకరు మరణించారు. మరో 3,700 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో కొత్తగా 282 కరోనా కేసులు, ఒకరు మృతి
రాష్ట్రంలో కొత్తగా 282 కరోనా కేసులు, ఒకరు మృతి

By

Published : Dec 26, 2020, 5:38 PM IST

రాష్ట్రంలో గత 24 గంటల్లో 42,911 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 282 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 442 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా.. కడప జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు కోటీ 15 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

8,80,712 మందికి కరోనా సోకినట్లు వెల్లడించింది. 8.69 లక్షల మంది మహమ్మారి నుంచి కోలుకోగా..7,092 మంది మృతి చెందారని వివరించింది. ఇప్పటికీ.. 3,700 మంది వైరస్ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details