రాష్ట్రానికి నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ ఇవాళ బాధ్యతలు తీసుకోనున్నారు. 1987 బ్యాచ్ కు చెందిన ఆదిత్యనాథ్ దాస్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 8వ సీఎస్‌గా నియమితులయ్యారు. అంతకుముందు సీఎస్ నీలం సాహ్నీ బాధ్యతల నుంచి ఇవాళే రిలీవ్ కానున్నారు. అనంతరం ఆమె.. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా నియమితులు కానున్నారు. ఆమెకు గ్రామ సచివాలయాలు, కొవిడ్ 19 నిర్వహణ,ఇతర కీలకమైన బాధ్యతల్ని ముఖ్యమంత్రి అప్పగించారు.
ఇవాళ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్న ఆదిత్యనాథ్ దాస్ - ఏపీ కొత్త సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ వార్తలు
ఏపీ కొత్త సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన బాధ్యతలు తీసుకుంటారు.
![ఇవాళ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్న ఆదిత్యనాథ్ దాస్ ఇవాళ సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10064708-1044-10064708-1609354356253.jpg)
ఇవాళ సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు