రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 39,848 పరీక్షలు నిర్వహించగా.. 385 కొవిడ్ కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి(ap corona cases news). ఫలితంగా కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,373కి చేరింది. ఇప్పటివరకు 20,47,722 మంది బాధితులు కోలుకున్నారు. ఈ మేరకు వైద్యా ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ (covid cases in andhra pradesh) విడుదల చేసింది.
గడిచిన 24 గంటలల్లో వైరస్ బారినుంచి 675 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,355 యాక్టివ్ కేసులు(active covid cases in ap) ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,95,18,787 కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.