గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 172 మందికి కరోనా సోకినట్టుగా వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8 లక్షల 87 వేల238కు చేరింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,357గా వైద్యాధికారులు తెలిపారు.
గడిచిన 24 గంటల్లో కొవిడ్‌తో కడపలో ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7,150గా ఉంది. గత 24 గంటల వ్యవధిలో 203 మంది.. వైరస్ బారినుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8 లక్షల 78 వేల 731కి చేరింది.