సీఎం జగన్ ఇంతలా దిగజారిపోతారని అనుకోలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్లో విమర్శించారు. రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు మీడియా ప్రతినిధులపై తప్పుడు కేసులు పెట్టిస్తారా అని ప్రశ్నించారు. విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టి పాఠశాలను ఆక్రమించే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఆయన నిలదీశారు. మీడియా స్వేచ్ఛని హరించిన నియంతలు కాలగర్భంలో కలిసిపోయారన్నారు. జీఓ 2430 ద్వారా జగన్ నియంతృత్వ ధోరణి బయటపడిందన్నారు. మీడియా ప్రతినిధులపై కేసుల ద్వారా జగన్ భయం బయటపడిందన్నారు. మీడియా ప్రతినిధులపై పెట్టిన తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఉద్యమాన్ని అణచివేసేందుకు మీడియాపై తప్పుడు కేసులు: లోకేశ్
మీడియా స్వేచ్ఛను హరించిన నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్లో మండిపడ్డారు. రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు మీడియా ప్రతినిధులపై తప్పుడు కేసులు పెట్టిస్తారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఇంతలా దిగజారిపోతారని అనుకోలేదన్నారు.
నారా లోకేశ్ వ్యాఖ్యలు