దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన పరీక్ష.. సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాలకు అనుమతించమని అధికారులు ప్రకటించడంతో.. విద్యార్థులంతా హడావుడిగా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.
నీట్ పరీక్షకు నిర్వహణకు రాష్ట్రంలో 10 పట్టణల్లో 151పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో దాదాపు 59 వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అభ్యర్ధులు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్నారు. పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించమని అధికారులు చెప్పడంతో.. అధికారులు హడావుడిగా పరీక్ష కేంద్రాలకు తరలివచ్చారు. అభ్యర్థులతో పాటు తల్లిదండ్రులు తరలిరావడంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. పరీక్షా కేంద్రాల వద్ద సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో.. పలుచోట్ల దూర ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు.. రోడ్లపైనే పడిగాపులు పడుతున్నారు.
నీట్-2021.. అభ్యర్థుల తల్లిదండ్రుల పడిగాపులు నీట్-2021.. అభ్యర్థుల తల్లిదండ్రుల పడిగాపులు తొలిసారి..
తొలిసారిగా మచిలీపట్నం కృష్ణా వర్సిటీలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందుగానే గదులను శానిటైజేషన్ చేశామని అధికారులు చెప్పారు. అన్ని వసతులతోపాటు పోలీసులతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని వివరించారు. విద్యార్థులు మాస్క్‌లు ధరించి పరీక్ష కేంద్రానికి రావాలని.., ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆభరణాలకు అనుమతి లేదని చెప్పారు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖ, తెనాలి, నరసరావుపేట, మచిలీపట్నం, మంగళగిరిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు విధిగా ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటో తీసుకురావాలన్నారు. కొవిడ్ నిబంధనల మేరకు మాస్కు ధరించాలని.. వాటర్ బాటిల్, శానిటైజర్ చిన్న బాటిల్ కు అనుమతిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి:NEET 2021: నేడే నీట్ పరీక్ష.. ఈ నిబంధనలు మర్చిపోవద్దు!