NEET EXAM 2022: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నీట్పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్ ద్వారా నిర్వహించే పరీక్షలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి వస్తువులు, ఆభరణాలకు అనుమతి ఇవ్వలేదు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. 1.30 గంటల వరకే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు.
NEET EXAM 2022: ప్రశాంతంగా ముగిసిన నీట్ - latest news in ap
NEET EXAM 2022: రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా నీట్ పరీక్ష ముగిసింది. పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లను అధికారులు చేశారు. ట్రాఫిక్ వల్ల పలుచోట్ల ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షాకేంద్రాల్లోకి అనుమతించలేదు. కొన్నిచోట్ల తల్లిదండ్రుల ఆందోళనతో అనుమతిచ్చినట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి వస్తువులు, ఆభరణాలకు అనుమతి ఇవ్వలేదు.
NEET EXAM
ట్రాఫిక్ జాం వల్ల పలుచోట్ల విద్యార్థులు ఆలస్యంగా కేంద్రాలకు రాగా.. వారిని లోపలికి పంపలేదు. ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతి లేకపోవడంతో పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేశారు. కొన్ని కేంద్రాల్లో ఉన్నతాధికారులు స్పందించి ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించగా.. మరికొన్నిచోట్ల నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించలేదు. ఇటువంటి నిబంధనలు అమలు చేయడం వల్ల విద్యార్థుల ఏడాది కష్టం వృథా అవుతుందంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: