ప్రభుత్వం, ప్రజల సహకారంతో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్ నీలం సాహ్ని అన్నారు. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో ఎస్ఈసీగా ఆమె బాధ్యతలు చేపట్టారు. దీంతో విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా ఎన్నికల కమిషనర్‌గా సాహ్ని గుర్తింపు పొందారు. తనపై విశ్వాసంతో ఎస్ఈసీగా ఎంపిక చేసిన గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు. నూతన ఎస్ఈసీకి కమిషన్ కార్యదర్శి కన్నబాబు, ఇతర ఉద్యోగులు అభినందనలు తెలిపారు.
ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
ఎస్ఈసీ నూతన కమిషనర్ నీలం సాహ్ని
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీకాలం ముగియడంతో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టే ముందు ఆమె ఈ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని గవర్నర్ ఉత్తర్వుల్లో పేర్కొనడంతో ముఖ్యమంత్రి జగన్ ముఖ్య సలహాదారు పదవికి ఆమె రాజీనామా చేశారు.
ఇదీ చూడండి:భట్టిప్రోలు మండలంలో వారంరోజులపాటు లాక్‌డౌన్
Last Updated : Apr 1, 2021, 12:04 PM IST