ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రహదారులు రివైజ్డ్​ బిడ్డింగ్ నిబంధనల్లో మార్పులు - నాబార్డు, ఎన్డీబీ నిబంధనలు మార్పు వార్తలు

నాబార్డు, ఎన్డీబీ సహకారంతో రాష్ట్రంలో నిర్మించనున్న రహదారుల రివైజ్డ్​ బిడ్డింగ్ నిబంధనల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ-ప్రోక్యూర్ మెంట్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దాఖలు చేసిన ఈ-టెండర్ ప్రతులను చీఫ్ ఇంజినీర్​కు సమర్పించాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

రహదారులు రివైజ్డ్​ బిడ్డింగ్ నిబంధనల్లో మార్పులు
రహదారులు రివైజ్డ్​ బిడ్డింగ్ నిబంధనల్లో మార్పులు

By

Published : Oct 10, 2020, 10:23 PM IST

రహదారుల రివైజ్డ్​ బిడ్డింగ్ నిబంధనల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. టెండర్ల దాఖలు కోసం చెల్లించాల్సిన బ్యాంకు గ్యారెంటీల విషయంలోనూ వెసులుబాటు కల్పిస్తూ రహదారులు భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాల్లో ఉన్న భారత జాతీయ బ్యాంకుల నుంచి లేదా జాతీయ బ్యాంకుల కౌంటర్ హామీతో విదేశీ బ్యాంకుల గ్యారెంటీలు చెల్లుబాటును ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ అంశాలను టెండర్ నిబంధనల్లో మార్పులు చేస్తూ రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో తక్కువ బిడ్లు దాఖలు కావటంతో రహదారుల టెండర్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 6400 కోట్లతో 3 వేల కిలోమీటర్ల రహదారులను నిర్మించాలని నిర్ణయించారు.

ABOUT THE AUTHOR

...view details