కృష్ణాజిల్లా మైలవరంలో డీఎస్పీ బి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో నూజివీడు డివిజన్ పరిధిలోని అన్ని స్టేషన్లలో పట్టుబడ్డ 826 లీటర్ల నాటు సారాను పోలీసులు ధ్వంసం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలంలో అక్రమ రవాణా చేస్తున్న 100 లీటర్ల సారాను జగ్గంపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక టాటా మ్యాజిక్ వాహనాన్ని సీజ్ చేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు.