నేచురల్ స్టార్ నాని విజయవాడలో సందడి చేశాడు. త్వరలో విడుదల కాబోతున్న గ్యాంగ్ లీడర్ సినిమా ప్రమోషన్లో భాగంగా సినిమా ముచ్చట్లు పంచుకున్నారు. ఇంటిల్లిపాది సంతోషంగా వచ్చి ఆనందించదగ్గ సినిమా గ్యాంగ్ లీడర్ అని నాని అన్నారు. హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుందన్న హీరో.. చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. జెర్సీ సినిమాతో కాస్త భావోద్వేగానికి గురిచేసినా.. గ్యాంగ్ లీడర్‌తో మాత్రం కడుపుబ్బా నవ్విస్తానన్నాడు. పైరసీని ప్రోత్సహించకుండా ప్రతి ఒక్కరూ థియేటర్‌కు వచ్చి సినిమా చూడాలని నేచురల్ స్టార్ కోరాడు.
హాయిగా నవ్వుకునేలా.. గ్యాంగ్ లీడర్: హీరో నాని - gang leader movie
గ్యాంగ్ లీడర్ ప్రమోషన్లో భాగంగా నేచురల్ స్టార్ నాని విజయవాడలో సందడి చేశారు. ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుందన్నారు. ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వటం ఖాయమని ఆయన అన్నారు.
హాయిగా నవ్వుకునేలా గ్యాంగ్ లీడర్: హీరో నాని