ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు

రాష్ట్రవ్యాప్తంగా 32వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో సంబంధిత అధికారులు వారోత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. వారోత్సవాలు ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి17 వరకు జరగనున్నాయి.

National Road Safety week start
రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు

By

Published : Jan 18, 2021, 7:03 PM IST

కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని బాడవ టోల్ ప్లాజా వద్ద రోడ్డు భద్రతా వారోత్సవాలను నూజివీడు సబ్ డివిజన్ డీఎస్పీ బి.శ్రీనివాసులు ప్రారంభించారు. ఆటో డ్రైవర్లు ప్రయాణీకుల రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారని.. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ఆటోలను నడపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఐదుగురికి మించి ఆటోల్లో ఎక్కించరాదన్నారు. రోడ్డు భద్రత విషయంలో సమాజాన్ని మేల్కొపే బాధ్యత ఆటో డ్రైవర్లు తీసుకోవాలని కోరారు.

చిత్తూరు జిల్లాలో..

చిత్తూరు జిల్లా పుత్తూరులో సబ్ డివిజన్ పోలీస్ అధికారి కార్యాలయంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పుత్తూరు డీఎస్పీ, మోటార్ వాహనాల తనిఖీ అధికారి సంయుక్తంగా కరపత్రాలను విడుదల చేశారు. నూతన రవాణా చట్టం మేరకు 18 ఏళ్లలోపు పిల్లలకు వాహనాలను ఇవ్వరాదని తల్లిదండ్రులు డీఎస్పీ సూచించారు. ప్రతి వాహనదారుడు రక్షణ కోసం ఆర్టీఏ నిబంధనలు పాటించాలన్నారు.

ప్రకాశం జిల్లాలో...

ఒంగోలు పట్టణం రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ మాసోత్సవాలు జనవరి 18 నుండి ఫిబ్రవరి 17 వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి జేసీ జి.వి మురళి, ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. రోడ్డు ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, ట్రాఫిక్ రూల్స్​ని తప్పనిసరిగా పాటించాలని జేసీ సూచించారు. యువతులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వాహనదారులు.. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎస్పీ సూచించారు.

పోలీసులు కనికరం చూపాలి..

ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ఆటో డ్రైవర్ల జీవనం దుర్భరంగా మారిందని ఏఎంసీ ఛైర్మన్ పామర్తి శ్రీనివాసరావు అన్నారు. ఐదుగురు ప్రయాణీకులతో ఆటో నడిపితే ఫైనాన్స్​లు కడుతూ కుటుంబాలను పోషించడం కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారి స్థితి గతులను దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖ ఆటో డ్రైవర్ల విషయంలో కనికరం చూపాలని కోరారు.

ఇదీ చూడండి:

ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్లొద్దన్నందుకు.. ఎస్సైపై యువకుల దాడి

ABOUT THE AUTHOR

...view details