మూడేళ్ల వైకాపా పాలనలో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులు ఏమైపోయాయని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన జాతీయ అధ్యక్షుడు వేమూరి ఆనంద సూర్య ప్రశ్నించారు. విజయవాడ సత్యనారాయణపురంలో జరిగిన బ్రాహ్మణ కార్యవర్గాల సమావేశంలో మాట్లాడిన ఆయన.. బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు పక్కదోవ పడుతుంటే.. వైకాపా ప్రభుత్వంలో ఉన్న బ్రాహ్మణ నాయకులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. బ్రాహ్మణుల సంక్షేమం పట్ల.. చిత్తశుద్ధి ఉంటే పదవులకు రాజీనామా చేసి పోరాడాలని వైకాపా బ్రాహ్మణ నాయకులను డిమాండ్ చేశారు.
'బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు పక్కదోవ పడుతుంటే... ఏం చేస్తున్నారు?' - Brahmin Corporation news
రాష్ట్రంలో బ్రహ్మణ కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులు ఏమైపోయాయని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన జాతీయ నాయకులు వేమూరి ఆనంద సూర్య ప్రశ్నించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు పక్కదోవ పడుతుంటే.. వైకాపా బ్రాహ్మణ నాయకులకు ఏం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆనంద సూర్య