ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

త్రివర్ణ పతాకానికి వందేళ్లు... విజయవాడలో ఫొటో ప్రదర్శన - త్రివర్ణపతానికి నేటితో వందేళ్లు పూర్తి

జాతీయ పతాకం వందేళ్ల చరిత్రను పురస్కరించుకుని... విజయవాడలో ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, పింగళి వెంకయ్య వారసులు పాల్గొన్నారు.

National Flag Exhibition in Vijayawada
విజయవాడలో జాతీయ పతాకం ఫోటో ప్రదర్శన ఏర్పాటు

By

Published : Mar 31, 2021, 4:33 PM IST

త్రివర్ణ పతాక వందేళ్ల చరిత్రను పురస్కరించుకుని విజయవాడలో.. ఫొటో ప్రదర్శన నిర్వహించారు. మహాత్మా గాంధీకి... పింగళి వెంకయ్య జాతీయ పతాకం అందజేసిన ప్రాంగణంలో... భవిష్యత్తు తరాలకు అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

'మా త్రివర్ణ పతాకం - మా గౌరవం' నినాదంతో చారిత్రక ఘట్టాలను వివరిస్తూ... విజయవాడలోని విక్టోరియా హాల్​లో ఆంధ్రప్రదేశ్ ఫొటో అకాడమీ అధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శనను మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, పింగళివెంకయ్య వారసులు తిలకించారు.

ABOUT THE AUTHOR

...view details