ఆంగ్లం రాకపోతే ప్రపంచంతో పోటీపడలేని పరిస్థితి ఉందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. విజయవాడలో జరిగిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఆంగ్ల మాధ్యమంపై కొందరు చేస్తోన్న విమర్శలను తప్పబట్టారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామంటే పెద్ద పెద్ద నేతలు, సినీ నటుడు పవన్ కల్యాణ్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంగ్ల మాధ్యమంపై విమర్శలు చేస్తున్న వారు తమ పిల్లలను ఏ మాధ్యమంలో చదివిస్తున్నారో చెప్పాలని జగన్ సూటిగా ప్రశ్నించారు.
మీ పిల్లలు ఏ మాధ్యమంలో చదువుతున్నారు:సీఎం జగన్ - jagan latest comments on pawan kalyan
ఆంగ్ల మాధ్యమంపై విమర్శలు చేస్తున్న నేతలు, సినీ నటులు తమ పిల్లలను ఏ మాధ్యమంలో చదివిస్తున్నారో తెలపాలని సీఎం జగన్ డిమాండ్ చేశారు.
మీ పిల్లలు ఏ మాధ్యమంలో చదువుతున్నారు:సీఎం జగన్