ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 7, 2021, 6:18 PM IST

ETV Bharat / city

చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: బీసీ సంక్షేమ సంఘం

బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు విజయవాడలో రౌండ్ టేబుల్ సమవేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైకాపా తూర్పు ఇన్​ఛార్జీ దేవినేని అవినాష్.. వైకాపా ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.

National BC Welfare Association Round Table Meeting
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమవేశం

బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధనకై అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బోను నరేశ్ కోరారు. విజయవాడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమవేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వైకాపా తూర్పు ఇన్​ఛార్జి దేవినేని అవినాష్.. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లకై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తామని ముఖ్యమంత్రి జగన్​ హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లపై విజయసాయి రెడ్డి పార్లమెంట్​లో ప్రైవేట్ బిల్లు పెట్టారని దేవినేని అవినాష్ గుర్తు చేశారు.

రాజకీయ పదవుల్లో రిజర్వేషన్ అమలు చేయకపోవడంతో బీసీలకు స్థానిక సంస్థల పదవుల్లో నష్టం కలిగిందని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ అన్నారు. బీసీలకు ఇచ్చే పథకాలను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి రౌండ్ టేబుల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. విదేశీ విద్య పథకం బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. కల్యాణలక్ష్మి వంటి పథకాలను అమలు చేయాలన్నారు. బీసీల ఓట్లతోనే వైకాపా అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు.

ఆ భూములపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి..

విజయవాడ రామలింగేశ్వర నగర్ కట్ట వద్ద దేవాదాయశాఖ భూమిలో నివాసముంటున్న వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని దేవినేని అవినాష్​ మండిపడ్డారు. కావాలని ప్రతిపక్షాలు అక్కడి ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున వారికి హామీ ఇస్తున్నాం. ఆ భూమిలో నివాసాలను తొలగించబోమన్నారు. ముఖ్యమంత్రి జగన్​తో మాట్లాడి.. వాళ్లకు త్వరలో శాశ్వత నివాసాలకు పట్టాలు ఇప్పిస్తామన్నారు.

ఇదీ చదవండి...

CBI COURT NOTICES:

బెయిల్ రద్దు పిటిషన్‌లో విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు

ABOUT THE AUTHOR

...view details