కరోనా సహాయ చర్యల కోసం సీఎం సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. నాట్కో ఫార్మా లిమిటెడ్ రెండున్నర కోట్ల రూపాయలను.. ఆన్‌లైన్‌లో బదిలీ చేసినట్లు సీఎం కార్యాలయం తెలిపింది. ఇదేసమయంలో కోటిన్నర విలువైన ఔషధాలు, పీపీఎఫ్ కిట్లు కూడా అందజేసినట్లు నాట్కో ఫార్మా లిమిటెడ్ తెలిపింది. కళ్లాం గ్రూపు ఛైర్మన్ హరనాధరెడ్డి సంస్థ తరఫున 25 లక్షల చెక్కు అందజేసినట్లు సీఎం కార్యాలయం స్పష్టం చేసింది. ప్రకాశం జిల్లా పర్చూరులోని శీతల గిడ్డంగుల యజమానులు సీఎం సహాయ నిధికి 4 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన సంబంధిత చెక్కును వైకాపా నియోజకవర్గ భాద్యుడు రామనాధంబాబుకు అందజేశారు. విజయవాడకు చెందిన నాలుగేళ్ల హేమంత్.. తాను సైకిల్ కొనుక్కునేందుకు పోగుచేసుకున్న 971 రూపాయలను.. మంత్రి పేర్నినానికి అందించారు. హేమంత్‌ను అభినందించిన పేర్నినాని తన సొంత డబ్బుతో సైకిల్ కొని ఇస్తానని.. హామీ ఇచ్చారు.
సీఎం సహాయనిధికి 'నాట్కో ఫార్మా లిమిటెడ్ రెండున్నర కోట్లు విరాళం' - సీఎం సహాయనిధికి 'నాట్కో ఫార్మా లిమిటెడ్ రెండున్నర కోట్లు విరాళం'
రాష్ట్రంలో కరోనా సహాయ చర్యల కోసం సీఎం సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. నాట్కో ఫార్మా లిమిటెడ్ రెండున్నర కోట్ల రూపాయలతో పాటుగా కోటిన్నర విలువైన ఔషధాలు, పీపీఎఫ్ కిట్లు అందజేసినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.

సీఎం సహాయనిధికి 'నాట్కో ఫార్మా లిమిటెడ్ రెండున్నర కోట్లు విరాళం'