ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వెనుకబడిన వర్గాలపై వివక్ష తగదు' - Narashetti Narasimha rao latest news

వైకాపా ప్రభుత్వం బడుగుల పట్ల వివక్ష చూపుతోందని ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు ఆరోపించారు. వెనుకబడిన వర్గాలపై జరుగుతున్న ఈ దాడులను నిరసిస్తూ.. నవంబర్ 6వ తేదీన విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నట్టు వివరించారు.

Narashetti Narasimha rao fires on jagan over attacks on Dalit
నరహరశెట్టి నరసింహారావు

By

Published : Nov 3, 2020, 5:15 PM IST

రాష్ట్రంలో ఓసీలకు ఇచ్చినంత స్థాయిలో.. వెనుకబడిన వర్గాల వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు ఆరోపించారు. అత్యాచార, హత్యలకు గురైన మహిళల కుటుంబాలకు న్యాయం, పరిహారం ఇచ్చే అంశంలో వైకాపా ప్రభుత్వం ఓసిలైతే ఒకలా.. ఎస్సీలయితే మరోలా ఇస్తోందని విమర్శించారు.

పక్క రాష్ట్రంలో మహిళకు జరిగిన అన్యాయంపై స్పందించి.. దిశ పేరుతో చట్టాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి జగన్.. మన రాష్ట్రంలో మహిళలపై, ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. వరప్రసాద్ న్యాయం కావాలని రాష్ట్రపతికి లేఖ రాసినా.. రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన వర్గాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. నవంబర్ 6న విజయవాడలో మహాధర్నా చేపడుతున్నట్టు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details