జోగి రమేశ్ ముందే చెప్పినా పోలీసులకు సమాచారం లేదా ?: లోకేశ్ - naralokesh latest updates
పోలీసుల తీరుపై నారా లోకేశ్ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇంటిపైకి దాడికెళ్తున్నానని జోగి రమేష్ స్వయంగా ప్రకటించి మరీ గూండాలతో దాడిచేస్తే మీకు సమాచారం లేదా అని ప్రశ్నించారు.
పోలీసులపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. వైకాపాకు వత్తాసు పలికే పోలీసులు పవిత్రమైన ఖాకీ యూనిఫామ్ తీసేసి తాడేపల్లిలో బులుగు కండువాలు కప్పుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్‌ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబు ఇంటిపైకి దాడికెళ్తున్నానని జోగి రమేష్ ప్రకటించి మరీ గూండాలతో దాడిచేస్తే మీకు సమాచారం లేదా అని ప్రశ్నించారు. తాగి గూండాలతో మాజీ సీఎం ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్‌కి కొమ్ముకాసి పోలీసు వ్యవస్థ గౌరవాన్నే మంటగలిపారని మండిపడ్డారు.