ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పది, ఇంటర్​ పరీక్షలు రద్దు కోరుతూ.. అమిత్​ షాకు లోకేశ్​ లేఖ

జూన్​ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై.. జోక్యం చేసుకోవాలని నారా లోకేశ్​ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. విద్యార్థుల ఆరోగ్యపరిస్థితులు, మానసిక వత్తిడి, తల్లిదండ్రుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

lokesh letter to amith shah
అమిత్​ షాకు లోకేశ్​ లేఖ

By

Published : May 25, 2021, 4:26 PM IST

రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షల రద్దుకు కేంద్రం జోక్యం కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. దేశంలోని 14 రాష్ట్రాలతో పాటు ఐసీఎస్​ఈ, సీబీఎస్​ఈ బోర్డులు పరీక్షలు రద్దు చేశాయన్న ఆయన.. రాష్ట్రంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా చర్యలు ఉన్నాయన్నారు. జూన్ 7 నుంచి వేలాది పరీక్షా కేంద్రాల్లో 6 లక్షల 70 వేల మంది విద్యార్థులకు పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. 5 లక్షలకు పైగా ఇంటర్ విద్యార్థులు పరీక్షల పట్ల అనిశ్చితిని ఎదుర్కొంటున్నారన్నారు.

గతేడాది నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధంగా లేరని లోకేశ్‌ స్పష్టం చేశారు. సరైన ప్రత్యామ్నాయాలు లేకుండా పరీక్షలు పెడితే.. విద్యార్థులు సూపర్‌స్ప్రెడర్ లుగా మారే అవకాశముందన్నారు. ఆన్​లైన్​ ద్వారా తాము నిర్వహించిన అభిప్రాయ సేకరణలో 5 లక్షల మంది పరీక్షల రద్దుకు మద్దుతు పలికారని చెప్పారు. విపత్తు వేళ విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టడం తగదని హితవు పలికారు. పరీక్షలు వద్దంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు అభ్యర్థనలను గౌరవించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details