మాజీ మంత్రి వివేకా మరణంపై.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ముఖ్యమంత్రి జగన్ తీరును తప్పుబట్టారు. ఓట్ల కోసం సొంతబాబాయిపై గొడ్డలి వేటు వేశారని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలపై వైఎస్ కుటుంబానికి పేటెంట్ హక్కులున్నాయన్నారు. వైఎస్ కుటుంబసభ్యులు ఒక్కొక్కరినీ సీబీఐ పిలుస్తోందన్న లోకేశ్.. సొంతింటి గొడ్డలే వివేకాను చంపిందని స్పష్టం అవుతోందని చెప్పారు.
NARA LOKESH: 'సొంతింటి గొడ్డలే వివేకాను చంపిందని స్పష్టమవుతోంది' - తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
కోట్ల కోసం సొంత బాబాయ్‌పై గొడ్డలి వేటు వేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్.. ముఖ్యమంత్రి జగన్ పై ఆరోపణలు చేశారు. దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలపై వైఎస్ కుటుంబానికి పేటెంట్ హక్కులున్నాయని విమర్శించారు.
![NARA LOKESH: 'సొంతింటి గొడ్డలే వివేకాను చంపిందని స్పష్టమవుతోంది' నారాలోకేశ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12761508-890-12761508-1628852902519.jpg)
నారాలోకేశ్