ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NTR Trust: 'కులమతాలకు అతీతంగా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు' - కులమతాలకు అతీతంగా కరోనా విపత్తులో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు న్యూస్

కరోనా విపత్తులో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తున్నామని సంస్థ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 24గంటలు పనిచేసే కాల్ సెంటర్​ను అందుబాటులో ఉంచటంతో పాటు అన్నదాన కార్యక్రమాలు ద్వారా 78 వేల మందికి ఆహారం అందించామన్నారు.

NaraBhuvaneswari On NTR Trust Activities
కులమతాలకు అతీతంగా కరోనా విపత్తులో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు

By

Published : Jun 11, 2021, 8:45 PM IST

కులమతాలకు అతీతంగా కరోనా విపత్తులో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తున్నామని సంస్థ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ట్రస్ట్‌ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకూ 782 మందికి పైగా రోగులకు నిపుణులైన వైద్యులతో ఆన్​లైన్ ద్వారా వైద్య సేవలు అందిస్తే.. 480 మంది కోలుకున్నారని భువనేశ్వరి తెలిపారు.

ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 24గంటలు పనిచేసే కాల్ సెంటర్​ను అందుబాటులో ఉంచటంతో పాటు అన్నదాన కార్యక్రమాలు ద్వారా 78 వేల మందికి ఆహారం అందించామన్నారు. అనాథలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ మానవ సేవే-మాధవ సేవ అనే నినాదంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ట్రస్టు సీఈవో రాజేంద్రప్రసాద్, వైద్యులు లోకేశ్వరరావు, నిరంజన్ మోటూరి, శేషగిరి, పాండురంగ తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details